సూర్యాపేటలో సేఫ్టీ లోకల్ఆటో యునియన్ నూతన కార్యాలయం ప్రారంభం
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో సేఫ్టీ లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నూతన కార్యాలయాన్ని సూర్యాపేట ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కుర్వి సైదులు ప్రారంభించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కుర్వీ సైదులు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో అంటూ వారిని జాగ్రత్తగా వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆటోలను నమ్ముకుంటూ జీవనం వెళ్లతీస్తున్నమని అన్నారు. ప్రభుత్వం ఉచిత బస్సులను తీసుకొచ్చి మా ఆటో డ్రైవర్లను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఆర్థిక అబ్బందులతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని తక్షణమే మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుండె వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కె అహ్మద్, జిల్లా ఉపాధ్యక్షులు తండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఖుషి వెంకన్న, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అహ్మద్, పట్టణ ఉపాధ్యక్షులు ముదిరాజ్ శ్రీనివాస్, అడ్డ అధ్యక్షులు మామిడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.