మూసీ నది ప్రక్షాళన అవసరమా? అనవసరమా?……
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : మూసీ నది ప్రక్షాళన సుందరీకరణ నేడు తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలం నుండి ముఖ్యమైన చర్చ కొనసాగుతోంది ఇది అవసరమా? అనవసరమా?
అనే విషయాన్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మూసీ నది ఉదాంతం: మూసీ నది వికారాబాద్ దగ్గర కొండల్లో నుండి హైదరాబాద్ రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నల్లగొండ సూర్యాపేట జిల్లాల ద్వారా ప్రవహిస్తూ చివరికి నల్లగొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది సుమారు 400 కిలోమీటర్లు ప్రవహిస్తూ కృష్ణా నదిలో కలుస్తున్నది మూసీ నది ప్రయోజనాలు: మూసీ నదిపై మధ్యతరహా ప్రాజెక్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సోలిపేట వద్ద 4.6 టిఎంసిల సామర్థ్యం గల ప్రాజెక్టును నిర్మించారు అవే కాకుండా చిన్న తరహా చెరువులు అనేక చెక్ డాములు కలవు వాటిలో గండిపేట హుస్సేన్ సాగర్ రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక చెరువులు ఉన్నాయి ఈ చెరువుల ద్వారా చెక్ దమ్ముల ద్వారా మూసి ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సుమారు రెండు లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది మూసి నీరు పూర్తిగా రసాయనాలతోనూ చెత్తాచెదారాలతోనూ మురికి నీటితోనూ కలుషితం కావడం వల్ల సాగు పంటలకు మరియు ఆహార పంటలకు ఆహారంగా తీసుకోవడం వలన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావము చూపే అవకాశం కలదు మూసీ నది మురికి కోపంగా ఎలా మారింది: మూసి నది ఒడ్డున అనేక మందుల ఫ్యాక్టరీలు నిర్మించడం వాటి నుండి వచ్చే వ్యర్ధపదార్ధాలు మూసిలో వదిలివేయడం వలన మూసి యొక్క నీటి రంగు పూర్తిగా మారిపోయింది మూసీ నదికి అతి సంయుక్త అతి సమీపంగాను నది ఒడ్డున అనేక ఇంటి నిర్మాణాలు చేపట్టడం చెత్త చెదారం వ్యర్థ పదార్థాలు అన్ని ఆ నదిలో పారవేయడం మూసి నది ఒడ్డున ఉన్న లేక పట్టణాలు హైదరాబాదు నుండి ప్రవహించే మురికి నీరును మూసీ నదిలోకి వదిలివేయడం వలన మూసీ నది మొరికి కోపంగా మారిపోయింది జనాభా పెరగడం హైదరాబాద్ నగరానికి అనేకమంది వలస వెళ్లడం అక్కడ ఇంటి స్థలం కొనే స్తోమత లేకపోవడం వలన మధ్య తరగతికి చెందిన పేదరికానికి చెందిన అనేక కుటుంబాలు ఈ నది ఒడ్డున ఇంటి నిర్మాణాలు చేసుకున్నారు
ఇది గత 40 సంవత్సరాలు నుండి నిరంతరంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి 76 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పేదలకు ఒక గూడును సమకూర్చలేకపోవడం పూర్తిగా ఇది 40 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న అన్ని పార్టీల వైఫల్యమే అందుకు ఇన్నాళ్లుగా పరిపాలించిన అన్ని ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రభుత్వ భూములు కాపాడాల్సిన పాలకులు అధికారులు పేదలకు గూడు నిర్మించడంలో విఫలం కావడం వలన మూసి ఒడ్డున అనేకమంది పేదలు ఇల్లు నిర్మించుకున్నారు ఇది పూర్తిగా గత 40 సంవత్సరాల నుండి అధికారాన్ని కొనసాగించిన అన్ని ప్రభుత్వాలది దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది కొంతమంది పెద్దలు పలుకుబడి గల నాయకులు విలాస భవనాలు కూడా నిర్మించుకున్నారు వీటిని గుర్తించి కూల్చివేయాల్సిన అవసరం ఉన్నది పేద కుటుంబాలకు మాత్రం తప్పకుండా ప్రత్యామ్ చూపించాల్సిన అవసరం ఉన్నది వారిని బయటపడేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది
మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనా?: 40 సంవత్సరాల క్రితం మూసీ నదిలో ని నీటిని సాగునీరుతో పాటు త్రాగునీటిగా కూడా ఉపయోగించేవారు నేడు త్రాగునీరుకు అవకాశం లేదు ఆ నీటిలో కాలు పెట్టడానికి కూడా భయపడాల్సి వస్తుంది ఆ నీరు అంతా పూర్తిగా రసాయనాలతోనూ మురికితోను చెత్తతోను పూర్తిగా మురికి కోపంగా మారిపోయాయి ఆ నీరు మన శరీరానికి తాకితే శరీరానికి ఎలర్జీ రావడం తప్ప తప్పనిసరి అయింది బట్టలు కూడా ఉతకడానికి కుదరని మురికి కోపంగా మారిపోయినది ఆ నీటిని పశువులు కూడా త్రాగ త్రాగడానికి వీలు లేకుండా పోయినది ఆ నీటిని పశువులకు వినియోగించినట్లయితే వాటి ఆరోగ్యం పై ప్రభావం చూపే అవకాశం ఉన్నది
ఇలాంటి కలుస్తమైన ఈ నది నీటితో పండించిన కూరగాయలు ఆహార పంటలు మనము వినియోగించడం వలన మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని అనేక అధ్యయనాలు తెలియజేశాయి కావున మూసీ నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడం తక్షణ అవసరం రాజకీయాలకు అతీతంగా సహకరించాల్సిన అవసరం ఉన్నది మంచిని మంచి అని చెప్పగలిగే గొప్ప మనసు అన్ని రాజకీయ పార్టీలు అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది : కుసుమ సిద్దారెడ్డి