SAKSHITHA NEWS

రూ.175 లక్షల విలువ గల కళ్యాణలక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

మొగుళ్లపల్లి/గణపురం/భూపాలపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి, గణపురం, భూపాలపల్లి మండలాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విస్తృతంగా పర్యటించారు. మొగుళ్లపల్లి(64), గణపురం(72), భూపాలపల్లి(39) మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన మొత్తం 175 మంది కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్దిదారులకు రూ.1,75,20,300 విలువైన చెక్కులను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. మూడు చోట్ల చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకం ప్రజాప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందుతున్నట్లుతెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద, నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిళ్లకు భారం తగ్గిందని గుర్తుచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించినట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ గ్యాస్‌, రేషన్‌ కార్డులు, ఇండ్ల స్థలాలను కూడా మహిళల పేర్లమీదనే పంపిణీ చేస్తామన్నారు. ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.


పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే..
మొగుళ్లపల్లి లోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే మండల కేంద్రంలో జరిగిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నారు. అనంతరం గణపురం మండల కేంద్రంలోని ధర్మారావుపేట రోడ్డులో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, ప్రారంభించారు. ఈ అన్ని కార్యక్రమాలల్లో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మార్వో, ఎంపీడీవోలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.


SAKSHITHA NEWS