SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కుల గణన కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కుల గణన కార్యక్రమం లో భాగంగా ఈ నెల 6 వ తేది నుండి అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించడం జరుగుతుందని. ఉన్న ఆస్తులు, అప్పులు, కులం, ఆదాయమెంత, ఇంట్లో ఎంతమంది ఉంటారు.. ఎవరైనా విదేశాలకు గాని ఇతర రాష్ట్రాలకు గాని వెళ్లారా ఇంట్లో ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా ఇలా 56 ప్రధాన ప్రశ్నలు 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 రకాల ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరిస్తున్నారని. సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతిఒక్కరి ఫోన్ నంబరు, వారుచేసే వృత్తి, ఉద్యోగ వివరాలను తీసుకుంటున్నారు. అధికారులు కేవలం ప్రశ్నలు మాత్రమే అడిగి తెలుసుకుంటారని ఎవరు కూడా ఫోటోలు మరియు ఇతర జిరాక్స్ లు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అధికారులు రాజీవ్, మహదేవ్, సుబ్బ లక్ష్మీ, రేణుకా, ఏలేంద్ర, శ్రీదేవి, ప్రశాంతి, స్వాతి మరియు నాయకులు నిరంజన్ గౌడ్, నిఖిల్, రామారావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS