SAKSHITHA NEWS

నూజివీడు డిఎస్పి ప్రసాద్ యొక్క ఆదేశాలపై నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ యొక్క ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ లతో సమావేశమును ఏర్పాటు చేసినారు

ఈ సందర్భంగా ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ప్రయాణ సాధనాలలో ఎక్కువగా ఉపయోగించేది ఆటోలే అని

మండల హెడ్ క్వార్టర్ నాకు వివిధ గ్రామాల నుంచి ప్రయాణ సాధనాలుగా ఉపయోగిస్తున్న ఆటోలు డ్రైవర్లు ప్రయాణికులను పరిమితికి మించి అనుమతించరాదని

ఆటోలను నడిపే సమయంలో వేగం లేకుండా సురక్షితముగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని

ఆటోలలో ప్రయాణికులు ఏదైనా వస్తువు మర్చిపోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి అందజేయాలని వాటిని చేర్చుతామని

మహిళలు ఆటలలో ప్రయాణించే సమయాలలో ఎటువంటి ఆకతాయిలు వేధింపులకు గురికాకుండగా ఆటోడ్రైవర్లు మహిళలు మీ కుటుంబ సభ్యులకు భావించి వారికి రక్షణ కల్పించాలని

ఆటోలలో నిశ్శబ్ద వస్తువులను తరలించరాదని అలా తరలించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని

ఏదైనా అనుమానాస్పద వ్యక్తుల యొక్క కదలికల గాని అనుమానాస్పద వ్యక్తులు యొక్క వివరాలను డయల్ 112 కు గాని ఆగిరిపల్లి ఎస్ఐ ఫోన్ నెంబర్ 94407 96444 సమాచారం అందించవలసిందిగా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్.


SAKSHITHA NEWS