SAKSHITHA NEWS

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 38 వినతులు

*కమిషనర్ ఎన్.మౌర్య

నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కు 38 వినతులను వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ప్రజల నుండి వచ్చిన వినతులు ఆయా విభాగాల అధికారులు వెంటనే పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో అక్రమాలు జరిగాయని, నగరంలో ని సి.సి.రోడ్లలో ఉన్న గుంతలు పూడ్చాలని, లక్ష్మీపురం కూడలి తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు వేర్వేరుగా నిర్మించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, తమ వార్డుల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ అనిల్ కుమార్ కమిషనర్ ను కోరారు. తమ వద్ద మాష్టర్ ప్లాన్ రోడ్డుకు స్థలం తీసుకున్న టి. డి.ఆర్. బాండ్లు ఇప్పించాలని, తమ బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం మార్పులు వారం అవుతున్న చేయలేదని, నగరపాలక సంస్థలో విలీనం అయినా సెట్టిపల్లి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని, తన తల్లి పేరు మీద ఉన్న పన్ను ను వేరొకరికి మార్చారు పరిష్కరించాలని, రాహుల్ రెస్ట్ హౌస్ సమీపంలో డ్రెయినేజీ నీరు ఆగుతున్నాయని, మల్టి లెవల్ కార్ పార్కింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయని దీంతో మా వ్యాపారాలు పూర్తి తగ్గాయని, మాకు ప్రత్యామ్నాయం చూపాలని వ్యాపారస్తులు కోరారు.

అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ ఆయా విభాగాల అధికారులకు అర్జీలను కేటాయించారు. అన్ని అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, డి.సి.పి. మహాపతి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డి . ఈ.లు, ఏ.సి.పి.లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS