SAKSHITHA NEWS

నగరంలో రోడ్లపై ఎక్కడా గుంతలు ఉండకూడదు.కమిషనర్ ఎన్.మౌర్య

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన వీధులు, చిన్న వీధుల్లో ఎక్కడా గుంతలు లేకుండా పూడ్చాలని కమిషనర్ ఎన్.మౌర్య ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో రోడ్లపై గుంతలు పూడ్చడం, గత వారం ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 15 లోపు నగరంలో అన్ని వీధుల్లో గుంతలు లేకుండా పూడ్చేందుకు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే పలుచోట్ల ఇంజినీరింగ్ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని, పనులు వేగవంతం చేయాలని అన్నారు. ప్రతి సోమవారం ప్రజల నుండి వచ్చిన వినతులను ఏ మేరకు పరిష్కరించారని తెలుసుకుని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. అలాగే నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత బాగా చేపట్టాలని అన్నారు. పెండింగ్ పన్నులు వసూళ్లు త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలో అనధికారిక లేఔట్లు, భవన నిర్మాణాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్స్ సేతుమాధవ్, రవి, డిసిపి మాహాపతి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, మేనేజర్ హాసీమ్, డి.ఈ.లు, సూపరింటెండెంట్లు, ఏసిపి లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS