పదేళ్ల బీజేపీ పాలన భేష్..
పది నెలల కాంగ్రెస్ పాలన తుస్…
కేంద్రాన్ని విమర్శించే స్థాయి పొన్నంకు లేదు ..
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్..
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
పెగడపల్లి : పదేళ్ల మోడీ పాలనలో విద్వేష ప్రచారము, విధ్వంస చర్యలు తప్ప దేశానికి చేసింది ఏమీ లేదని ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సమాజం కేంద్ర ప్రభుత్వాన్ని క్షమించదని ప్రజాపాలనపై అవాకులు చెవాకులు పేల్చొద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ గారిని ఉద్దేశించి మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని రంగాల్లో తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అది తట్టుకోలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వెళ్లినా ఆరు గ్యారంటీల అమలు విషయంలో తెలంగాణా ప్రజలు ప్రశ్నించి అమలు చేయాలని ఎదురు తిరిగితే సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు ముఖము చాటేసుకుంటున్నారని ఏద్దేవా చేశారు.ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ ప్రారంభమైన ఇంతవరకు రైతులకు రైతు భరోసా ఇవ్వలేదని రెండు లక్షల పైబడి ఉన్న రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం అయ్యాయని అన్నారు.
బిజెపి 10 ఏళ్ల పాలనలో దేశంలో ఎక్కడ కూడా విద్వేష ప్రచారం విధ్వంస చర్యలు జరగలేదని పదేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో చాలా చోట్ల మత ఘర్షణలు జరిగాయని ఇటీవల హైదరాబాదులోని పాతబస్తీలో నాలుగు హిందూ దేవాలయాలపై విధ్వంస చర్యలు జరిగాయని దీనికి అంతటికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. మోడీ పదేళ్ల పాలన ప్రజా రంజకంగా ఉంది కాబట్టే మూడవసారి భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు అనే విషయం మంత్రి గుర్తించాలని అన్నారు.బీజేపీని విమర్శించడం మానుకొని ఆరు గ్యారంటీలు అమలు చేయాలని అన్నారు. వరికోతలు ప్రారంభం అయి నెల రోజులు గడుస్తున్న రైతులు కుప్పలు తెప్పలుగా దాన్యాన్ని తరలించిన ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదని ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు నష్టపోతే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూల్యం చేల్లించుకోక తప్పదని అన్నారు…