SAKSHITHA NEWS

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు .

పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగించుకోవాలి

పత్తి క్వింటాలు 7521రూ..

ఉండవెల్లి : నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్రంలోని అల్లంపూర్ నియోజకవర్గం ఎంతో ప్రసిద్ధి అని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఉండవెల్లి మండలం వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లు పత్తి కొనుగోలు కేంద్రంలను ఎమ్మెల్యే విజయుడు అధికారులతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు కేంద్రముకు తీసుకొని వచ్చి విక్రయించాలన్నారు. క్వింటాల్ పత్తికి 7521 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం జరిగింది. కావున రైతులు నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరలకు విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రం దగ్గర ఎలాంటి మధ్యవర్తులను దళారులను సంప్రదించకుండా నేరుగా రైతులు పత్తిని విక్రయించాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. కొనుగోలు కేంద్రం దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS