యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అదనపు కలెక్టర్(రెవెన్యూ) జి.వీరారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కొండకింద హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. 2024 మార్చి 11న కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు క్షేత్రానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. సీఎం హోదాలో రెండోసారి ఆయన గుట్ట క్షేత్ర పర్యటనకు వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట
Related Posts
నకిరేకల్ పట్టణానికి చెందిన టేకుల మధుకర్ రెడ్డి
SAKSHITHA NEWS నకిరేకల్ పట్టణానికి చెందిన టేకుల మధుకర్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హజరై శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క SAKSHITHA NEWS
డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుపై విద్యార్థినీల హర్షం
SAKSHITHA NEWS డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుపై విద్యార్థినీల హర్షం..!! తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 2017 నుండి ఇప్పటివరకు విద్యార్థులకు కాస్మెటిక్ డైట్ చార్జీలు పెంచకపోవడం…