అఖండ శివమాల ధరించిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు
శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు అఖండ శివమాల కార్తీక మాసమైన మొదటి రోజు వేశారు. ఈ సందర్భంగా దయాకర్ రాజు మాట్లాడుతూ కార్తీకమాసం మొదటి రోజు నుండి శివమాల ధరించి శివరాత్రి వరకు ఈ శివ మాల కొనసాగుతుందని తెలిపారు. కార్తికమాసంలో మరకత శివాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుని, స్వామి వారి ఆశీస్సులు పొందగలరని దయాకర్ రాజు కోరారు.