SAKSHITHA NEWS

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో కులగణనపై అవగాహన సదస్సు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :

ఈ నెల ఆరో తేదీ నుండి రాష్ట్రంలో నిర్వహించనున్న కులగణనపై జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఉదయం 11.00 గంటలకు అవగాహన సదస్సు, సమీక్షసమావేశం నిర్వహించడం జరుగుతుంది అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన.. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే ఆదేశానుసారం టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కుల గణనపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సి ఉందనీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా నేడు జరిగే సదస్సులో పార్టీలకతీతంగా మేధావులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కుల సంఘాల నాయకులు, మేధావి వర్గాల నాయకులు పాల్గొని తగు సలహాలు సూచనలు ఇవ్వగలరని కోరారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.


SAKSHITHA NEWS