నేషనల్ హైవే కమిటీ సభ్యులుగా బోస్,అవినాష్ రెడ్డి
నేషనల్ హైవే కన్సల్టింగ్ కమిటీ సభ్యులుగా వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్, లోక్సభ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నియమితులు అయ్యారు.ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు
జారీ చేసింది.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో లోక్సభ నుంచి 20మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులను కేంద్రప్రభుత్వం నియమించింది.