SAKSHITHA NEWS

బీసీ మైనర్ బాలిక మృతి పై తీన్మార్ మల్లన్న సీరియస్

30న గద్వాల్ కు రానున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

కుటుంబాన్ని పరామర్శించిన తీన్మార్ మల్లన్న టీం, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరిత

మహబూబ్ నగర్ :జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల పరిధిలోని బీసీ వర్గాల మైనర్ బాలిక వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రాజేశ్వరి మృతిపై గత కొన్ని రోజులక్రితం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సీరియస్ అయ్యారు.ఈ ఘటనపై ఈనెల 30న అనగా ఎల్లుండి బుధవారం బాలిక కుటుంబాని పరామర్శించడానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు రానున్నట్లు టీం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం శివ వీర్ తెలిపారు. సోమవారం వారు గద్వాల్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు కొమ్ముల ప్రవీణ్ రాజ్ తో కలిసి మైనర్ బాలిక రాజేశ్వరి స్వగ్రామమైన బీజ్వారంలో పర్యటించారు.రాజేశ్వరి మాతృమూర్తిని పరామర్శించారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సరిత తిరుపతయ్య కూడా కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడారు.రాజేశ్వరి మృతికి కార్మికులైన బండ్ల రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ ఇల్లుతో పాటు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు వెంకటరెడ్డి, విజయ్ కుమార్ గౌడ్, జోగులాంబ గద్వాల జిల్లా తీన్మార్ మల్లన్న టీం కో కన్వీనర్ నీల నర్సింలు,మల్దకల్ మండల కన్వీనర్ తిరుమల, జిల్లా అఖిలపక్షం సభ్యులు వెంకట్ రాములు, డీకే సుందర్ రాజ్, జ్యోతక్క, రవి, ప్రకాష్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS