పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం వారందరిని స్మరించుకోవడం మనందరి బాధ్యత………… జిల్లా ఎస్పీ*రావుల గిరిధర్ ఐపీఎస్
సాక్షిత వనపర్తి
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాలో భాగంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీనీ ప్రారంభించి ర్యాలిలో పాల్గొన్న జిల్లా ఎస్పీ
వనపర్తి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆద్వర్యంలో వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది . సైకిల్ ర్యాలీని జిల్లా ఎస్పీ జండా ఊపి ప్రారంభించారు .
ఈ కార్యక్రమంలో జిల్లాలోని యువకులు,విద్యార్థులు,వాకర్స్ పోలీస్ అధికారులు,పోలీస్ సిబ్బంది, అందరూ దాదాపుగా 200 మంది వరకు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ……
ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సైనికుల్లగా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని, ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని,అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకం అవుతూ వారి మన్ననలను పొందేలా విధులు నిర్వహిస్తున్నామని,పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. రక్తం గడ్డ కట్టే చలిలో దురాక్రమణలను అడ్డుకొని దేశం కోసం తమ ప్రాణాలనర్పించిన పోలీస్ అమరవీరులను ఎప్పటికీ మరువకూడదని అన్నారు.
దేశ అంతర్గత భద్రతలో భాగంగా విధులు నిర్వర్తిస్తూ ప్రతి ఏడాది ఉగ్రవాదుల చేతుల్లో,సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని తెలిపారు.వారందరిని స్మరించుకుంటూ ఈ నెల 21 నుండి 31 వరకు ఈ సంస్మరణ కార్యక్రమాలను జరుపుకుంటున్నామని తెలియజేసారు.
విధి నిర్వహణతోపాటు పోలీసు అధికారులు సిబ్బంది తమ ధైనందిన జీవితంలో ఏదో ఒక వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి అదనపు ఎస్పి రాందాస్ తేజవాత్, ఏ ఆర్ డి.ఎస్.పి, వీరారెడ్డి, వనపర్తి డి.ఎస్.పి, వెంకటేశ్వరరావు, వనపర్తి సిఐ, కృష్ణ, కొత్తకోట సిఐ, రాంబాబు,ఆత్మకూరు సిఐ, శివకుమార్, మరియు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.