ఎన్టీపీసి , పార్మసీటి లో మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని జీల్లా మంత్రి ని కోరిన – చింతకాయల.
ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర గనుల ,భూగర్భ వనరులు మరియు ఎక్త్సేజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర , అనకాపల్లి జీల్లా ఇన్ చార్జ్ మంత్రి గా తొలిసారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో 10 గంటలకు రాష్ట్ర మత్స్యకార నాయకులు ,ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ,రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు , చింతకాయల సూజాత ముత్యాలు మరియు ఇతర మత్స్యకార నాయకులు ,మహిళలు ,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని, మంత్రి గారిని గజమాలతో సత్కరించారు . మంత్రి గారికి ఈ సందర్భంగా మత్స్యకారులకు తక్షణమే ఎన్టీపీసి ,పార్మసీటి లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు . మంత్రి గారు సానుకూలంగా స్పందించారు .