SAKSHITHA NEWS

ప్రభుత్వ భూమి కబ్జా గురవుతున్న చోద్యం చూస్తున్న రెవిన్యూ అధికారులు.

  • చీపురుపల్లి తూర్పు రెవెన్యూ సర్వే 233 లో ప్రభుత్వ స్ధలం కబ్జా చేసిన సిరుముళ్ళ పైడిరాజు

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ పరిధిలో రజకుల కాలనీ గల చీపురుపల్లి తూర్పు రెవిన్యూ లో సర్వే నెంబరు 233 లో ప్రభుత్వం భూమి కలదు ఆ యెక్క ప్రభుత్వం భూమిలో కొంత స్థలాన్ని గతంలో ప్రభుత్వ రెవిన్యూ అధికార్లు మరియు ఐసిడిఎస్ సబ్బవరం ప్రాజెక్టు ఆఫీసర్ స్థలాన్ని పరిశీలించి సమ్మంగిపాలెం అంగన్‌వాడీ కేంద్రానికి 3 మూడు సెట్లు స్థలాన్ని కేటాయించారు ఆ యెక్క ప్రభుత్వ భూమిని రజకుల కాలనీ గ్రామానికి చెందిన సిరుముళ్ళ పైడిరాజు తండ్రి ముత్యాలు అనే వ్వక్తి సమ్మంగిపాలెం అంగన్ వాడీ కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి చూట్టూ ఫెన్సింగ్ ఎర్పాటు చేసుకొని రేకులు షెడ్డు నిర్మాణం చేపట్టారు

ఈ విషయం పై అనేక సార్లు గ్రామస్థులు రెవిన్యూ అధికార్లు దృష్టికి తీసుకు వెళ్లిన చోద్యం చూస్తున్నారు తప్ప ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్న సదరు వ్వక్తి సిరుముళ్ళ పైడిరాజు పైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్ధానిక ప్రజలు వాపోతున్నారు నాయుడుపాలెం పంచాయతీ పరిధిలో చీపురుపల్లి తూర్పు రెవెన్యూ సర్వే నెంబరు 233 లో ఉన్న ప్రభుత్వ భూమిని అన్యాక్రాతం కాకుండా భూ అక్రమదారుడు నుండి ఆ యెక్క స్థలాన్ని కాపాడి రేకుల షెడ్డు తొలగించి ప్రభుత్వం స్థలాన్ని స్వాధీనం వేసుకోవాలని పరవాడ తహశీల్దారు వారిని స్ధానిక గ్రామస్థులు కోరుతున్నాను.


SAKSHITHA NEWS