SAKSHITHA NEWS

వనపర్తి జిల్లా లో
రెవెన్యూ అధికారుల బదిలీలు

*సాక్షిత వనపర్తి :

రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలలోని పలువురు రెవెన్యూ ఉద్యోగులు, అదనపు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో భాగంగా వనపర్తి జిల్లా అదనపు కలక్టర్ రెవెన్యూ యం నగేష్ ను మెదక్ జిల్లా కు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు ను వనపర్తి జిల్లా అదనపు కలక్టర్ రెవెన్యూ గా బదిలీ చేశారు.
ఆర్డీఓ పద్మావతి నీ నారాయణపేట స్పెషల్ డిప్యూటీ కలక్టర్ గాను, ఆర్డీఓ నారాయణపేట మధు.మోహన్ ను వనపర్తి స్పెషల్ డిప్యూటీ కలక్టర్ (ఎస్.డి.సి) గా బదిలీ చేశారు.


వనపర్తి స్పెషల్ డిప్యూటీ కలక్టర్ సి.హెచ్ వెంకటేశ్వర్లు ను భూపాలపల్లి కి బదిలీ చేసి నల్గొండ ఎస్.డి .సి దరూరు సుబ్రమణ్యం ను వనపర్తి ఆర్డీఓ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్ 2024 ఫిబ్రవరి, 17 న వనపర్తి లో అదనపు కలక్టర్ గా బాధ్యతలు స్వీకరించి పార్లమెంట్ ఎన్నికల విధులు, రెవెన్యూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు.


SAKSHITHA NEWS