SAKSHITHA NEWS

మాజీ మంత్రి MLA హరీష్ రావు ని కుత్బుల్లాపూర్ MLA కేపీ.వివేకానంద ని పుట్టినరోజు సందర్భంగా, మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారి పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి , సిద్దిపేట MLA తన్నీరు హరీష్ రావు ని మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ.వివేకానంద ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగ వారిరువురు శ్రీనివాస్ రెడ్డి ని శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ , BRS నాయకులు మురళీ యాదవ్ , మన్నె శేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS