కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాము – ఎమ్మేల్యే కె.పి.వివేకానంద..
బీఆర్ఎస్ హయాంలో ఆదర్శవంతంగా కాలనీలు…
ఎ.పి.హెచ్.బి. కాలనీలో
రూ.49 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
కాలనీలను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎ.పి.హెచ్.బి. కాలనీలో రూ.49 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు మరియు ఓపెన్ జిమ్ అభివృద్ధి పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మరియు కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బి.ఆర్.ఎస్. ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో కోట్ల రూపాయల నిధులను వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతీ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసామని చెప్పారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోని అనేక కాలనీలను తమ బి.ఆర్.ఎస్ ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేసామని ఎమ్మేల్యే గారు అన్నారు..
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఎరువ శంకరయ్య, ప్రధాన కార్యదర్శి సుధాకర్ సీనియర్ నాయకులు జల్ద లక్ష్మీనాథ్, ఓంకార్ రెడ్డి, క్రాంతి యాదవ్, యాదిరెడ్డి, కార్తీక్ గౌడ్, మోహన్ లాల్, రహీం, లక్ష్మణ్ గౌడ్, సతీష్ గట్టోజీ, రమ్మీ, బాలు నేత, శ్రీనివాస్, అల్లావుద్దీన్,సాయి, టింకు బాబురావు, గౌస్ మహిళా నాయకులు తారక రాణి, ఈశ్వరి, కరుణ, ఎ.పి.హెచ్.బి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎరువ సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి సాయిబాబు, కాలనీ వాసులు రామచందర్రావు, జగన్మోహన్ రావు, భాష, వెంకట్ రెడ్డి, రాము, మధు, దుర్గాప్రసాద్, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు