మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన- ఒడితల ప్రణవ్
సామాన్య పేద ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా
కమలాపూర్ సాక్షిత
కమలాపూర్ మండల పరిధిలోని వంగపల్లి గ్రామానికి చెందిన అంకిళ్ల కవిత ఆకస్మిక మరణం చెందారు.వారి కుటుంబ సభ్యులందరూ శ్లోకసముద్రంలో మునిగిపోయి ఉన్నారు, అంకిళ్ల కవిత కుటుంబం కడు నిరుపేద కుటుంబానికి చెందినవారు వారి పరిస్థితి దీన పరిస్థితిలో ఉన్నందున వంగపెల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ దృష్టికి తీసుకుపోగా సామాన్య పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరపున సేవలందించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు.అంకిళ్ల కవిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి ఆసరాగా దహన సంస్కరణ నిమిత్తం తన వంతు సాయంగా ఐదు వేల రూపాయలను మృతురాలి కుటుంబ సభ్యులకు వంగపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు చేత వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో కుల పెద్దలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.