SAKSHITHA NEWS

భరతనాట్యంలో సర్వజ్ఞ విద్యార్ధుల ప్రతిభ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత:

తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన భరతనాట్య పోటీలలో సర్వజ్ఞ విద్యార్ధులు అద్భుతమైన ప్రతిభను కనబరచి విజయాలను సాధించి అనేక బహుమతులను పురస్కారాలను గెలుపొందారు. సర్వజ్ఞ విద్యార్ధులు వై. వర్ష, లక్షణ్య కుమరేష్, జి. మాన్వి, జి. ఆద్య, పి. యోగ్నశ్రీ, హైదరాబాద్ మరియు వేదాద్రి లో నిర్వహించిన పోటీలలో పాల్గొని వివిధ బహుమతులను అందుకున్నారు. నృత్యమాల నాట్య కళా వెల్ఫేర్ సొసైటీ, శ్రీ మువ్వ గోపాల కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఈ భరతనాట్య పోటీలలో ఐదవ తరగతి చదువుతున్న వై. వర్ష, అరవ తరగతి చదువుతున్న లక్షణ్య కుమరేష్, జి. మాన్వి, జి.ఆద్య, పి.యోగ్నశ్రీ విద్యార్ధులు బహుమతులను అందుకున్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన భరతనాట్య పోటీలలో వి. యోగ్నశ్రీ స్వర్ణ నంది పురస్కారం గెలుచుకుంది.

అలాగే వేదాద్రి లో నిర్వహించిన భరతనాట్య పోటీలలో వై. వర్ష, లక్షణ్య కుమరేష్, జి. మాన్వి, జి. ఆద్య విద్యార్థులు నాట్యకుసుమం పురస్కారం అందుకున్నారు. ఇంతటి ప్రతిభను కనబరిచిన సర్వజ్ఞ విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్స్ శ్రీ ఆర్.వి. నాగేంద్ర కుమార్, నీలిమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్. వి. నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కళలను ప్రోత్సహించడంలో సర్వజ్ఞ ఎప్పుడు ముందంజలో ఉంటుందని, కేవలం చదువుకే పరిమితం కాకుండా అన్ని రంగాలలో సర్వజ్ఞ విద్యార్థులు వారి ప్రతిభను కనబరుస్తారని, అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తూ విద్యార్ధుల పురోగతికి పాఠశాల యాజమాన్యం ఎప్పుడు తోడుగా ఉంటుంది అని తెలిపారు. సర్వజ్ఞ పాఠశాల ఖమ్మం విడిఒస్ కాలనీ నందు అత్యంత సౌకర్యంతో, ఎంతో అనుభవం కలిగిన అధ్యాపకులతో పరిమిత విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తూ అన్నింటా సర్వజ్ఞ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్స్ ఆర్వీ. నాగేంద్ర కుమార్, నీలిమ, ప్రిన్సిపల్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ విద్యార్ధులను అభినందిస్తూ తమ విద్యార్ధులు మున్ముందు మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.


SAKSHITHA NEWS