పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు, పాలకులతో పాటు ప్రభుత్వ అధికారులు ఎంతో కీలకం : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హెచ్చరిక…
సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం సమావేశంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో నిర్మాణ దశలో ఉన్న పనులపై, పెండింగ్ పనులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు, పాలకుల తో పాటు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
చెత్త తరలింపులో నిర్లక్ష్యం వద్దు…
చెత్తను తరలించడంలో శానిటేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా అన్ని చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు కలిగితే చర్యలు తప్పవు.
ఓపెన్ జిమ్ లను సక్రమంగా నిర్వహించాలి…
కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ లలో ఇప్పటికే ఉన్న ఓపెన్ జిమ్, పార్కులను సక్రమంగా నిర్వహించడంతో పాటు నూతన ఓపెన్ జిమ్ ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి. అదేవిధంగా పార్కుల్లో అవసరానికి అనుగుణంగా ఒకటి లేదా రెండు హై మాస్ లైట్లను ఏర్పాటుచేయడంతో పాటు ఉచిత మంజీరా నీటి కనెక్షన్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కాలనీలలో ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తిచేయాలి…
వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా కాలనీలలో తవ్విన సీసీ రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను తాత్సారం చేయకుండా వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ప్రగతి నగర్ స్మశాన వాటికలో బోరెవెల్, విద్యుత్ దీపాల ఏర్పాటుతో పాటు వాటి నిర్వహణపై చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, ఇంచార్జ్ కమిషనర్ దిలీప్ కుమార్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.