SAKSHITHA NEWS

45 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ గృహాలలో అన్ని పనులు పూర్తి చేసి పంపిణికి సిద్ధం చేయాలి .

సాక్షిత : కేసారం ఫేస్ 2 ఇందిరమ్మ కాలనీ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన….. కలెక్టర్

తాళ్ళ ఖమ్మంపహాడ్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

45 రోజులలో డబుల్ బెడ్ రూమ్ గృహాలలో అన్ని పనులు పూర్తి చేసి లబ్ధిదారులకి పంపిణి చేయుటకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం కేసారం వద్ద గల ఇందిరమ్మ ఫేజ్ 2 డబుల్ బెడ్ రూమ్ గృహాల సముదాయం ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ గృహా సముదాయం లోని అన్ని గృహలకు కరెంట్, నీటి వసతి లాంటి అన్ని మౌళిక వసతులు పూర్తి చేయాలని అధికారులకి సూచించారు. వాటర్ సంప్, సెప్టిక్ ట్యాంక్ పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

విద్యతోనే సమాజం లో గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం తాళ్ల ఖమ్మంపహాడ్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడతు విద్యార్థులకి అర్థమయ్యేలా విద్య భోదన చేయాలని,ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని కలెక్టర్ సూచించారు.తదుపరి ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ని, విద్యార్థుల హాజరు రిజిస్టర్ ని, వాటర్ ప్లాంట్ ని పరిశీలించారు అలాగే 7,8,10 తరగతి గదులలోకి వెళ్ళి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఆర్ & బి డి ఈ పవన్ కుమార్, ఆర్ ఐ శ్రీధర్, ఇంచార్జి ప్రధాన ఉపాధ్యాయులు చాంప్ల,ఉపాధ్యాయులు స్వరూప రాణి,బిబి నాంచారి, సంతోషిదేవి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS