SAKSHITHA NEWS

పెదముషిడివాడ దళిత భూ నిర్వసితుల 15 వ రోజు చేరిన నిరసన దీక్ష


సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామంలో గల దళితులకు జీవనాధారణ నిమిత్తం 1977లో సర్వేనెంబర్ 13 63 లో 44 కుటుంబాలకు, 1992-93లో సర్వేనెంబర్ 367 హలో 45 కుటుంబాలకు, డి పట్టా పాస్ పుస్తకాలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.2019 సంవత్సరంలో ల్యాండ్ పోలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం వారు దళితుల వద్ద నుంచి భూమిని తిరిగి తీసుకోవడం జరిగింది.2022లో VUDA వారు రెవెన్యూ సిబ్బంది ద్వారా LPC పత్రాలను ఇవ్వడం జరిగింది.

నాటి నుండి సుమారుగా మూడు సంవత్సరాలు అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది.ఈ విషయంపై ఐదుసార్లు స్పందన లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ, పలుమార్లు కలెక్టర్ కి ఎమ్మార్వో కి విన్నపించినప్పటికీ ఫలితం లేదు.కాగా దళితుల నుంచి సేకరించిన భూములలో ప్రభుత్వం వారు హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమం చేపట్టడంతో,పెదమసిడవాడ దళిత భూ నిర్వాసితులు మాకు న్యాయం జరగాలని గత 15 రోజులుగా దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా భూమిపై మాకు పూర్తి హక్కు రిజిస్ట్రేషన్ కల్పించాలని అప్పటివరకు దీక్షని కొనసాగిస్తామని తెలియచేస్తున్నారు.


SAKSHITHA NEWS