SAKSHITHA NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి .

నాగులపాటి అన్నారం లో
ఎ యం సి గోదాం, గ్రామ పంచాయతీ కార్యాలయంను పరిశీలించిన జిల్లా కలెక్టర్

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. పెన్ పహాడ్ మండలం అనాజీపురం లో ఐకేపీ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సన్నరకం, దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేయుటకు విడివిడిగా కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు.దొడ్డు రకం వడ్లకి రూ.2320, సన్నరకం వడ్లకు అదనంగా 500 భోనస్ కలిపి రూ.2820 ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.

రైతులు తాలు లేకుండా,తేమ శాతం 17 ఉండేలాగా చూసుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొని రావాలని సూచించారు.అనాజీపురం లో సన్నరకం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరగా తహసీల్దార్, ఎంపిడిఓ, ఎ ఓ, ఎ పి యం సమావేశం అయి సన్న రకం వడ్లు కొనుగోలు కేంద్రానికి ఎక్కువ గా వచ్చే విధంగా ఉంటే సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. తదుపరి నాగులపాటి అన్నారం లో ఉన్న 5100 మెట్రిక్ టన్నుల ఎ యం సి గోదాం ని పరిశీలించారు.కొనుగోలు కేంద్రాల నుండి సన్న రకం వడ్లను నిల్వ చేయుటకి
ఎ యం సి గోదాం ను ఉపయోగించాలని అధికారులకి సూచించారు. ప్రస్తుతం గోదాంలోని 3500 మెట్రిక్ టన్నుల వడ్లు నిల్వ గల రెండు షెడ్ లను ప్రెవేట్ వ్యక్తులకి లీజ్ కి ఇవ్వటం జరిగిందని అలాగే 1600 మెట్రిక్ టన్నుల ఒక షెడ్డు ఖాళీగా ఉందని అధికారులు కలెక్టర్ కి తెలుపగా వెంటనే లీజ్ రద్దు చేసి మొత్తం 5100 మెట్రిక్ టన్నుల నిల్వ ఉండే మూడు షెడ్డులను
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే ధాన్యానికి మాత్రమే ఉపయోగించాలని కలెక్టర్ అధికారులకి సూచించారు.


SAKSHITHA NEWS