SAKSHITHA NEWS

అక్టోబర్ 20నపానుగల్ లో సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు: శ్రీరామ్

*సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లాలోనిపానగల్ మండల కేంద్రంలో ఆదివారం అక్టోబర్ 20వ తేదీన సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్ తెలిపారు. వనపర్తి సిపిఐ ఆఫీసులో మాట్లాడారు. సిపిఐ రాజకీయ విధానం క్యాడర్లోకి బలంగా తీసుకువెళ్లి, గ్రామాల్లో పార్టీని పటిష్టం చేయటం, ప్రజా సమస్యలపై పోరాటం లక్ష్యాలుగా తరగతులు ఉంటాయన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు ఎండి యూసఫ్, ఉమామహేశ్వర్, జిల్లా కార్యదర్శి విజయరాములు ‘సమకాలీన రాజకీయాలు’, ‘వివిధ రాజకీయ పార్టీలు సిపిఐ విశిష్టత”పార్టీ నిర్మాణం’అంశాలపై ప్రసంగిస్తారన్నారు. జిల్లా పార్టీ బాధ్యులు పాల్గొనాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ, గోపాలకృష్ణ, పట్టణ నాయకులు జయమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS