SAKSHITHA NEWS

బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ..
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-

ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని 106 మంది లబ్ధి దారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపత్రి షైలెందర్ రెడ్డి ఆద్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు.ప్రజా సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు మెరుగు మురళి గౌడ్, బొప్పు తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి రవి, గోపతి నరేష్, వేల్పుల రవి, మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS