SAKSHITHA NEWS

ప్రతిభను చాటే క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని కార్యాలయంలో ఇంటర్నేషనల్ కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన మహేష్ వైష్ణవి MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి తనకు లభించిన మెడల్స్ ను చూపించింది. ఈ సందర్బంగా మహేష్ వైష్ణవి ని ఆయన అభినందించారు.

ఈ నెల 4 నుండి 13 వ తేదీ వరకు సౌత్ ఆఫ్రికా లోని సన్ సిటీ లో జరిగిన పోటీలలో సుమారు ౩౦ దేశాలకు చెందిన 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారని ఆమె వివరించారు. 84 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ తో పాటు స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ద చాంపియన్ షిప్ మెడల్ కూడా లభించిందని చెప్పారు. తనకు మొదటి నుండి MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, యువ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్ లు అన్ని విధాలుగా అండగా ఉంటూ ప్రోత్సహించడం వల్లనే తాను ఈ మెడల్స్ ను సాధించగలిగానని కృతజ్ఞతలు తెలిపింది. తనపై ఎంతో నమ్మకంతో కామన్వెల్త్ పోటీలకు హాజరుకావడానికి ఆర్ధిక సహకారం అందించిన విషయాన్ని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేసింది.


SAKSHITHA NEWS