నూతన అంగన్వాడి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్…
పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్ పేట మండలం చింతల బడవంజ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్ర భవనాన్ని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి ద్వారా గ్రామంలో ఉన్న బాలింతలకు, గర్భిణీలకు, చిన్న పిల్లలకు, ప్రతిరోజు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని అన్నారు.గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులు అంగన్వాడి వ్యవస్థను ఉపయోగించుకోవాలని అన్నారు. చిన్నారులకు మొదటి గురువుగా అంగన్వాడి టీచర్ బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి శాంతి శ్రీ , సిడిపిఓ విమల కుమారి, అంగన్వాడి సూపర్ వైజర్ జ్యోతిలక్ష్మి,మండల ఎన్డీఏ కుటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు