SAKSHITHA NEWS

ఏపీకి హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి?

హైదరాబాద్:
డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్(డీఓపీటీ) ఉత్తర్వు లపై స్టే ఇవ్వడానికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నిరాకరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడింది.

న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఐఏఎస్ అధికారులు భావిస్తున్నా డీవోపీటీ విధించిన గడువు ముగియ నున్న దృష్ట్యా, ఏపీలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని సీనియర్ ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమ్రపాలి స్థానంలో ప్రస్తుతానికి ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా హెచ్ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించే అవకాశము న్నట్టు సమాచారం


SAKSHITHA NEWS