రాడార్ స్టేషన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి భూమి పూజ
వికారాబాద్ జిల్లా :
వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం నిర్మించే వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఇవాళ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భూమి పూజ చేయనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలోపాల్గొంటారు.ఈ కార్యక్రమానికి నేవీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం కాగా, అక్కడ ఎవరూ నిరసనలకు దిగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటికే పలు వురు నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. ఏఐకే ఎంఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై.గీతను పోలీసులు అరెస్టు చేశారు.
సముద్రంలేని రాష్ట్రంలో నేవీ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుండడం ఏంటని?పలు పర్యావరణ సంస్థల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వు ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణం చేపట్ట వద్దని అంటున్నారు. ఆ నిర్మాణం చేపడితే జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుందని అంటున్నా రు. కాగా, 2027 నాటికి ఈ రాడార్ స్టేషన్‌ను అందు బాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.