SAKSHITHA NEWS

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పల్లెపండుగ కార్యక్రమం

రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది

ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగించింది

రాష్ట్రంలో గత టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప ఐదేళ్లలో ఎక్కడా ఒక్క రోడ్డు నిర్మాణం కూడా జరగలేదు

ప‌ల్లె పండుగ కార్య‌క్ర‌మం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 4,500 కోట్ల నిధుల‌తో 30,000 పనులు

నందిగామ నియోజకవర్గంలో 20 కోట్లతో అభివృద్ధి పనులు… ఒక్క కంచికచర్ల పట్టణంలోని కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జనసేన సమన్వయ కర్త తంబళ్ళపల్లి రమాదేవి

ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల

గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఏం చంద్రబాబు నాయుడు డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. సోమవారం నాడు కంచికచర్ల పట్టణంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి మరియు కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యం ఎన్డీఏ సర్కార్‌తోనే సాధ్యమవుతుంది. ఒకే రోజు 13,326 పంచాయతీ గ్రామసభలు, అభివృద్ధి పనులకు తీర్మానాలు చేయడం చరిత్రాత్మకం అన్నారు. పల్లె పండుగలో రూ.4,500 కోట్లతో 30 వేల పనులు చేపడుతున్నాం అన్నారు. సంక్రాంతిలోపు గ్రామాల్లో 3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచులు భిక్షాటన చేసేలా చేసిందన్నారు. జగన్ పాలనలో తట్ట మట్టి వేయకుండా, పంచాయతీ నిధులను కూడా దారి మళ్లించారు” అని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక పార్టీ నేతలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS