SAKSHITHA NEWS

కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించిన కమాలొద్దిన పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా. సౌజన్య లత
ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షితమైన, సాధారణ ప్రసవాలు – జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. జయచంద్ర మోహన్

సాక్షిత వనపర్తి
ప్రసుత్వ ఆసుపత్రిలో సురక్షితమైన సాధారణ ప్రసవాలు జరుగుతాయని, పెద ప్రజలు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులతో పాటు ఆరోగ్యం పాడు చేసుకోవద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. జయచంద్ర మోహన్ అన్నారు.
కమాలొద్దీన్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ అయిన డా. సౌజన్యలత గర్భిణీ అయిన తను స్వయంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తకోటలో చేరి సోమవారం పండంటి బిడ్డను జన్మనిచ్చినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిడ్డకు జన్మనిచ్చిన డా. సౌజన్యలత ఒక రోల్ మోడల్ గా నిలిచిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొనియాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తకోట చేరుకొని తల్లి బిడ్డలను పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవసరం ఉన్న లేకున్నా సీజేరియన్ అని ఇతరత్రా కారణాలు చూపించి డబ్బులు వసూలు చేస్తారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సురక్షితమైన పద్ధతిలో సాధారణ ప్రసవాలు జరిపిస్తారని ఆయన వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది ఉండటం వల్ల సాధారణ ప్రసవాలు చేయించడానికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగే విధంగా చూడాలని సూచించారు.


SAKSHITHA NEWS