SAKSHITHA NEWS

జోహార్లు ప్రొఫెసర్ సాయిబాబా గారికి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ఢిల్లీ ప్రొఫెసర్,హక్కుల నాయకుడు సాయిబాబా గారు నిన్న నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. వారికి నేడు సిపిఐ జగత్గిరిగుట్ట కార్యాలయం వద్ద వారి చిత్రపటానికి సిపిఐ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి మృతికి సంతాపం తెలియచేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సాయిబాబా గారు పోలియో వల్ల 90 శాతం అంగవైకల్యంతో పేద కుటుంబంలో పుట్టి ప్రొఫెసర్ గా అయ్యారని,చదువుతున్న సమయంలోనే ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమలు చేసి రైతు కూలీ మహసభలను,ఉద్యమాలను నడిపిన గొప్ప పోరాట యోధుడని అన్నారు. 90 శాతం అంగవైకల్యం ఉన్నపటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపా చట్టం కింద అరెస్టు చేసి జైలు కు పంపించిందని,మనిషి సహకారం లేనిదే ఎలాంటి పనులు చేసుకోలేని వ్యక్తిని అండా సెల్ లో వేసి చిత్రహింసలు పెట్టారని,చివరికి కరోనా సమయంలో కరోనా సోకితే కుటుంబ సభ్యలు పంపిన మందులను తన తోటి ఖైదీలకు చనిపోతే ముగ్గురం చనిపోతాం లేకపోతే బతుకుతామని చెప్పి ఒక్కడికి సరిపోయే మందులను ముగ్గురికి పంచిన గొప్ప నేటితరం విప్లవకారుడు సాయిబాబా గారని అన్నారు. చివరికి సాయిబాబా గారిని నేరం ఒప్పుకోకపోతే మరణిస్తావు అని జైలు అధికారులు భయపెట్టినప్పటికీ భయపడకుండా నేను చావును నిరకరిస్తున్న అంటూ కవిత్వం రాసి తనకు ప్రజలపై, పోరాటాల పై ఉన్న నిబద్దతను తెలియచేటుందని అన్నారు.
చివరికి ప్రభుత్వం సాయిబాబా గారిపై పెట్టిన కేసులో సాక్ష్యాలు నిరూపణ కాకపోవడం వల్ల సుప్రీం కోర్ట్ కేసును కొట్టివేసిందన్నారు. ఇలా ప్రభుత్వం తాను చెయ్యని నేరానికి నేరం మోపడం వల్ల అన్యాయంగా 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడని,ఆ సమయంలో ఏర్పడిన గాయాలు,అనారోగ్య సమస్యల వల్లే వారు మరణించారని అన్నారు. ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించకుండా ఉద్యమకారులను జైలులో వెయ్యడం,చంపి వెయ్యడం వల్ల లాభం లేదని,కావున సమస్యల పరిష్కారం కొరకు పనిచెయ్యాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్,ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, జర్నలిస్ట్ వెంకట్, సిపిఐ నాయకులు ప్రభాకర్,సోమన్న, నారాయణ, దక్షిణమూర్తి, సుందర్,రమేష్,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS