కొడిమ్యాల:వందేమాతరం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ డాన్సర్ కొట్టాల హంసిని రెడ్డిని ఆదివారం ఘనంగా సన్మానించారు. హంసిని గత కొద్ది కాలంగా హిందూ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ వీక్షకులను అలరించడంతోపాటు, భక్తి భావనలను పెంపొందిస్తున్నదని యూత్ సభ్యులు ప్రశంసించారు. హంసిని గతంలో జిల్లా స్థాయిలో ఉత్తమ డాన్సర్ గా ఎంపిక అవడంతో పాటు, తిరుపతిలోనూ నృత్య ప్రదర్శన ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా దేవి ప్రముఖులు బైరి రవీందర్, బైరి వెంకటి, ఏనుగు ఆదిరెడ్డి, గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టాల తిరుపతిరెడ్డి, వందే మాతరం ఫ్రెండ్ యూత్ సభ్యులు, చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు
నాట్యకారినికి సన్మానం
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…