SAKSHITHA NEWS

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మధినాగుడా లోని రామకృష్ణ నగర్ కాలనీ లో దసరా పర్వదినం సందర్భంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపంలో జరిగిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి వేడుకలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో , శాంతి సౌభాగ్యలతో జీవించాలని PAC చైర్మన్ గాంధీ ఆకాక్షించారు.

ఈ కార్యక్రమంలో వినోద్ రావు, గణేష్ రెడ్డి, శ్యామ్,విష్ణు, అనిల్ రెడ్డి ,కాశినాథ్ యాదవ్, మరియు కాలనీ వాసులు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS