SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన నీలం మధు ముదిరాజ్..
బీసీల సామాజిక, ఆర్థిక, కుల సర్వే తక్షణమే ప్రారంభించాలని ఆదేశాలిచ్చిన సీఎం కి ధన్యవాదాలు తెలిపిన నీలం..
సీఎం కు దసరా శుభాకాంక్షలు తెలిపిన నీలం..

సాక్షిత : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు, ఈ సందర్భంగా పూల మొక్క అందించి సీఎం కు దసరా మరియు బీసీ కులగణన అమలుపై శుభాకాంక్షలు తెలిపారు.
బీసీ ల సామాజిక, ఆర్థిక, కుల సర్వే తక్షణమే ప్రారంభించి 60 రోజులలో పూర్తి చేసి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని తీసుకున్న నిర్ణయం పట్ల నీలం మధు హర్షం వ్యక్తం చేశారు, బీసీ లకు రాజకీయంగా అవకాశం కల్పిస్తూ సామాజిక న్యాయం దిశగా పాలన కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి బీసీ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఇందిరమ్మ పాలనను గుర్తు చేస్తూ పరిపాలన కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.


బీసీ కులగణన తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని ధిమా వ్యక్తం చేశారు.
ప్రజాపాలన కొనసాగిస్తు అమలుచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నీలం మధు కు ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా పథకాలను ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సైనికుడి లా కృషి చేసి పార్టీ బలోపేతానికీ కృషి చేస్తానని నీలం మధు తెలిపారు.


SAKSHITHA NEWS