SAKSHITHA NEWS

ముందు ఇక్కడి కార్మికులకు తరువాత ఇతరులకు కేటాయించండి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

సాక్షిత : జగత్గిరిగుట్ట అడ్డా వద్ద భవన నిర్మాణ కార్మికులు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం,నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ లు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జగత్గిరిగుట్ట భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత 40సంవత్సరాలుగా చివరి బస్టాప్ వద్ద అడ్డా ఏర్పాటు చేసుకొని పని చేస్తుంటే జనాభా పెరగడం,వాహనాల రద్దీ పెరగడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు,ఆక్సిడెంట్ జరిగి మరణాలు కూడా సంభావించి మృతి చెందిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాలు క్రితం హెచ్ఎంటి ఖాళీ స్థలంలో అడ్డగా ఏర్పర్చుకొని పని చేస్తున్నారని ఈ విషయాన్ని లేబర్ ఆఫీస్ లో,అదే విధంగా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వగా 2 నెలల క్రితం గాజులరామారం ఆర్ ఐ గారు వచ్చి సర్వే జరిపి పరిశీలించడం కూడా జరిగిందన్నారు.
కానీ నేడు ఆకస్మతుగా ఈ స్థలాన్ని అమల బ్లూ క్రాస్ సొసైటీకి కేటాయించమని,అడ్డా నాయకులను కానీ, ఎవ్వరికి చెప్పకుండా ఇక్కడ ఉన్న జాతీయ జండాను,కార్మిక జండాను తొలగించి స్థలాన్ని చదును చెయ్యడం దారుణమని, భవన నిర్మాణ కార్మికులకు స్థలం కేటాయించి తరువాత ఇతరులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
స్థలం కేటాయించకుండా అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తే తీవ్ర ఆందోళన తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, అధ్యక్షుడు హరినాథ్,సిపిఐ సహాయ కార్యదర్శి దుర్గయ్య,ప్రజా నాట్యమండలి అధ్యక్షుడు బాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష,కార్యదర్శులు రవి,రాము, నాయకులు సామెల్,యాదగిరి, సోమయ్య,వెంకన్న,చంద్రయ్య,సైదులు,కరుణాకర్,అంజి,మధు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS