మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మరియు సహకార శాఖ మార్కెట్ యార్డ్ నూతనంగా ఎన్నికైన వారికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన కొలన్ హన్మంత్ రెడ్డి ||
నేడు వ్యవసాయ మరియు సహకార శాఖ మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా మార్కెట్ యార్డ్ కమిటీ నూతనంగా ఎన్నికైన సందర్బంగా వ్యవసాయ, సహకార & చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన కమిటీ బొమ్మలపల్లి నర్సింహులు (చైర్మన్ ), తున్కి బిక్షపతి (డైరెక్టర్ ), గాదె వినోద్ (డైరెక్టర్ ), ఈగ శ్వేతా (డైరెక్టర్ ) గార్లకు శాలువాతో సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో 129 డివిజన్ మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, రజాక్, ముక్కు రామారావు, బాల నర్సింహులు, వెంకట్ రెడ్డి, యూసఫ్, మల్లేష్, నర్సింహులు, భాను చందర్, రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.