సీఎం రేవంత్ సొంత గ్రామానికి దసరా కానుకలు
సీఎం రేవంత్ సొంత గ్రామానికి దసరా కానుకలు
దసరా పండగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి వస్తుండడంతో కొండారెడ్డిపల్లితో పాటు వంగూరు మండలంలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టడంపై అధికారులు దృష్టి సారించారు. వంగూరు మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు డబుల్ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు కాగా.. మరో రూ.170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గత నెల రోజుల నుండి పనులు పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.