దసరా ఎఫెక్ట్.. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఫుల్ రద్దీ
దసరా ఎఫెక్ట్.. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఫుల్ రద్దీ
దసరా పండగ సెలవుల నేపథ్యంలో చాలా మంది సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, జూబ్లీ బస్స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీ నెలకొంది. కళాశాలలకు సైతం సెలవులివ్వడంతో ఊళ్లకు వెళ్లేవారితో బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడుపుతున్నప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రయాణికుల రద్ధీతో పిల్లాపాపలతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.