SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి

యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్ పిలుపు

సీఎం రేవంత్ పర్యటనకు అందేమోహన్ ఆధ్వర్యంలో 1000 బైకుల ర్యాలీ

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గం పర్యటన సందర్భంగా కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ విభాగం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని కొందుర్గు మండలంలో ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. 1000 బైకులతో నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనకు యూత్ కాంగ్రెస్ వర్గాలు కదలి వెళ్తున్నట్టు తెలిపారు. విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం పర్యటనలో భాగంగా తమ ప్రాంతానికి రావడం ఎంతో సంతోషకరమని అందేమోహన్ తెలిపారు.. కేపి


SAKSHITHA NEWS