SAKSHITHA NEWS

బావిలో అనుమానస్పదంగా మహిళా మృతి..

-బుద్దారం ధర్మ తండాకు చెందిన పాత్లావత్ శాంతమ్మగా గుర్తింపు
*…..

సాక్షిత వనపర్తి :
వనపర్తి నియోజకవర్గం
గోపాలపేట మండలం బుద్దారం గ్రామం ధర్మతాండకు చెందిన పాత్లావత్ శాంతమ్మ(40) అనే గిరిజన మహిళను గుర్తు తెలియని వ్యక్తులు చెన్నూర్ అడ్డ రోడ్డు దాటిన తర్వాత బుద్దారం కు వచ్చే దారిలో రోడ్డు పక్కనే ఉన్న రైతు పొలంలోని బావిలో చంపేసి పడేసివెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుండి వెళ్లిన శాంతమ్మ రాత్రి అయినా తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు..

ఉదయం బావి దగ్గరకు వెళ్లిన పొలం యజమాని తన బావిలో చీర తేలాడుతూ పొలం యజమానికి కనిపించడంతో వనపర్తి రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని చుట్టుపక్కల గ్రామాలకు తెలుపగా తండా నుంచి వచ్చిన గిరిజనులు ఆ చీరను చూసి శాంతమ్మగా గుర్తించారు. ఆ బావి పక్కల ఒక క్వార్టర్ సీసా, గ్లాసులు, ఒక టవల్, చికెన్ ముక్కలు ఉన్నాయి దీంతో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళను అక్కడికి తీసుకువచ్చి చంపేసి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి భర్త బద్రునాయక్ మరియు ముగ్గురు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి రూరల్ ఎస్సై మరియు సీఐ పరిశీలుస్తున్నారు .


SAKSHITHA NEWS