SAKSHITHA NEWS

సీఎం చేతుల మీదుగా టీచర్స్ నియామక పత్రాలను అందుకునేందుకు హైదరాబాద్కు బయలుదేరిన 123 మంది డీఎస్సీ అభ్యర్థులు

*సాక్షిత వనపర్తి :
డీఎస్సీ పరీక్షల్లో టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు నియామక పత్రాలు అందుకునేందుకు హైదరాబాదుకు బయలుదేరారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ అభ్యర్థులను మూడు ప్రత్యేక బస్సుల్లో జెండా ఊపి  సాగనంపారు.

  హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. 

వనపర్తి జిల్లా నుండి మొత్తం మూడు బస్సుల్లో 123 మంది ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కు బయలుదేరారు.

కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, ఏవో భాను ప్రకాష్, తాసిల్దార్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS