SAKSHITHA NEWS

  • చిన్నగుంటపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు
    చట్టాలపై అవగాహన కల్పించిన డిఫెన్స్ లీగల్ ఎడ్ కౌన్సిల్……………. జి. ఉత్తరయ్య సాక్షిత వనపర్తి అక్టోబర్8

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చిమనగుంటపల్లి గ్రామంలో మంగళవారం వనపర్తి జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు ను నిర్వహించడం జరిగింది.*
ఈ కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య మాట్లాడుతూ నిషేద భూములు మరియు లావుని పట్టా భూముల చట్టాల పై మరియు మోటార్ వెహికల్స్ చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలాని లేనిపక్షంలో వారి పై క్రిమినల్ కేసులు అయిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారు కావున వారి బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసిన వాళ్ల అవుతారని తెలియజేశారు.

డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి మాట్లాడుతూ సైబర్ క్రైమ్స్ మరియు వేక్ అప్ గురించి తెలియజేస్తూ అత్యాశకు పోయి తమ డబ్బులు పోగొట్టుకోకూడదని తెలియజేశారు. నేటి యువత ఆన్లైన్ గేమ్స్ కు బానిసలై తల్లిదండ్రుల వద్ద డబ్బులను తీసుకుని అనేక చెడు అలవాట్లకు పాల్పడడమే కాకుండా డబ్బును పోగొట్టుకుంటున్నారు. న్యాయవాదల సంఘము ఉపాధ్యక్షులు డేగల కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామాలలో చిన్నపిల్లలకు బాల్య వివాహాలు చేయకూడదని అలా చేస్తే అది చట్టారీత్యా నేరమని తెలియజేశారు. ఏ సమయంలోనైనా మహిళలకు, బాలికలకు వృద్ధులకు ఇబ్బందులు ఉన్నప్పుడు సఖి సెంటర్ కు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నరేంద్రబాబు మరియు ఏఎస్ఐ గ్రామ ప్రజలు లోకదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS