SAKSHITHA NEWS

శ్రీ కనకదుర్గ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
మహా అన్నదాన కార్యక్రమం

•ముఖ్యఅతిధిలుగా పాల్గొన్న -సీఐ హరికృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డా,, మౌటం కుమారస్వామి

కమలాపూర్ సాక్షిత న్యూస్ (అక్టోబర్ 7)

అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ దుర్గామాత దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గ యూత్ అసోసియేషన్ సభ్యులు కమలాపూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం నందు ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత అమ్మవారి మండపం వద్ద ఐదో రోజున కమిటీ సభ్యులు మహా అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమలాపూర్ సీఐ హరికృష్ణ హాజరై తన చేతుల మీదిగా భక్తులకు అన్న వితరణ చేసి, అనంతరం అమ్మవారి దర్శనం చేసుకొని కృప కటాక్షాలు ఆశీస్సులు పొందారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి మహా అన్నదాన, ప్రసాదాన్ని స్వీకరించి అమ్మ వారి ఆశిస్సులు పొందరు . ఈ కార్యక్రమంలో కనకదుర్గ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జంగిలి రాజేష్ ఉపాధ్యక్షులు జంగిలి రాకేష్ కార్యదర్శి గంధ సిరి అనిల్ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS