చైతన్య జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని చైతన్య జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను కళాశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థినులు బతుకమ్మ ఆడి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ఆచార సాంప్రదాయానికి ప్రతీక అని కళాశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ యాదగిరి రెడ్డి, అధ్యాపకులు మల్లికార్జునరావు, యాదయ్య, శ్రీనివాస్, రవీందర్, శ్యామ్, సుమిత్ర, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.