జర్నలిస్టుల హక్కుల సాధనకై కలిసి రావాలని పిలుపు
వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడి టేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలి.
దళిత వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలలో మొదట ప్రాధాన్యం కల్పించాలి.
డి.రవిప్రసాద్
దళిత యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాక్షిత వనపర్తి అక్టోబర్ 4: భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ దళితులపై , దళిత జర్నలిస్టులపై మరియు మహనీయుల విగ్రహాలపై ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో జర్నలిస్టులకు కూడా సరైన గౌరవం దక్కడం లేదు. అందుకు దీనిని తీవ్రంగా డియుడబ్ల్యూజే తరపున ఖండిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధులు ముందుచూపు లేని కారణంగా గతంలో ప్రభుత్వ రాయితీలు లబ్ధి పొందిన జర్నలిస్టులకే మళ్లీ లబ్ధి చేకూర్చటం జరిగింది. జర్నలిస్టులమంటే కార్మికులమనే భావన ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రహించాలి.
ఇళ్ల స్థలాలు , డబుల్ బెడ్ రూములు, యాడ్సులు , అక్రిడేషన్ కార్డులు మరియు ఇతర ప్రయోజనాలు కొన్ని పత్రికలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చి మిగతా పత్రికలను చిన్నచూపు చూస్తు , ప్రభుత్వ ఫలాలను అందిన వాళ్లకే అందిస్తూ అదిగో పులి, ఇదిగో తోక అనే చందంగా ఉంది ఈ ప్రభుత్వాల పనితీరు. జర్నలిస్టులను మభ్యపెట్టడం ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తగదని , ప్రజల తరఫున ప్రభుత్వాలను పడగొట్టాలన్న, నిర్మించాలన్న జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఒక్క వార్త వెయ్యి మెదళ్లను కదలిస్తుందని ఆయన అన్నారు. నిజమైన వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను , గుర్తింపు కలిగిన ఏ పత్రిక కైనా వెంటనే ప్రభుత్వం పరిశీలించి, పరిష్కార మార్గం చూపాలని వార్త రాస్తున్న ప్రతి జర్నలిస్ట్ కు న్యాయం చేయాలనీ ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగ సూత్రాలను అనుసరిస్తూ యూనియన్లకు సంబంధం లేకుండా జర్నలిస్టుల స్వప్రయోజనాలను పక్కన పెట్టి , మన హక్కులను , వాటాలను సాధించేవరకు అందరినీ కలుపుకొని అలుపెరుగని న్యాయపోరాటాలు చేయాలని విలేకరుల సమావేశంలో దళిత యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ (DUWJ) వ్యవస్థాపక అధ్యక్షులు డి.రవిప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్,ప్రధాన కార్యదర్శి జె.పర్వతాలు, నాయకులు ఆర్.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.