టిడిపి ఆధ్వర్యంలో 155 వ జయంతి నీ పురస్కరించుకొని మహాత్ముడి కి ఘన నివాళి
మహాత్ముడి అడుగుజాడల్లో నడుద్దాం……టిడిపి నాగర్ కర్నూల్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు బి.రాములు పిలుపు
సాక్షిత వనపర్తి :
అహింసా మార్గాన్ని ఎన్నుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయుడు మన జాతిపిత మహాత్మా గాంధీ అని అలాంటి మహాత్ముని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజం ముఖ్యంగా యువత ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ నాగర్కర్నూల్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు బోలమోని రాములు పిలుపునిచ్చారు మహాత్మా గాంధీ 155 జయంతిని పురస్కరించుకొని పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలోని గాంధీ చౌక్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినఅనంతరం పై విధంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీను కాగితాల లచ్చన్న ఎండి దస్తగిరి డాక్టర్ బాలయ్య కొత్త గొల్ల శంకర్ డి బాలరాజ్ ఎం డి ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు